అన్నమయ్య జిల్లా కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
✅రాయచోటి ఆగస్టు
అన్నమయ్య జిల్లా
కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
📌 కేసు నమోదు:
2025 ఆగస్టు 18న కేశాపురం వీఆర్వో ఎర్రంపల్లి మనీలదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిన్నమండెం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మొదట BNSS Sec.194 కింద అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన ఈ కేసు, దర్యాప్తులో హత్యగా తేలింది.
📌 మృతురాలు:
ముదిమడుగు శ్రీదేవి (వయసు 45), భర్త – కృష్ణమూర్తి, – సవరంపల్లి, స్వగ్రామం – పొన్నెటిపాలెం, మదనపల్లె మండలం.
📌 నిందితుడు:
గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (వయసు 30), తండ్రి – శివమల్లప్ప నాయుడు, నివాసం – నాయనవారిపల్లె, మడితాడు పంచాయతీ, సుండుపల్లి మండలం.
📌 హత్యకు దారితీసిన కారణం:
నిందితుడు మరియు మృతురాలు మధ్య కొంతకాలంగా సన్నిహితం ఉంది. నిందితుడు పలు సార్లు డబ్బు అడిగినా, మృతురాలు ఇవ్వలేదు. అదనంగా, గొడవలు వచ్చినప్పుడు మృతురాలు తమ సన్నిహితం గురించి బయట పెడతానని బెదిరించేది. ఈ విషయం బహిర్గతమైతే తన కుటుంబానికి అవమానం కలుగుతుందనే భయంతో, నిందితుడు ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్నాడు.
📌 హత్య విధానం:
04.08.2025న మృతురాలు నిందితుడికి ఫోన్ చేసి 05.08.2025న కలవాలని కోరింది.
05.08.2025న మృతురాలు బస్సులో గుర్రంకొండకు రాగా, నిందితుడు ఆమెను తన మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు.
మార్గమధ్యంలో ఒక పెట్రోల్ బంక్‌లో ఒక బాటిల్‌లో పెట్రోలు కొనుగోలు చేశాడు.
ఉదయం 11:20 నుంచి 12:00 మధ్య అడవిలోకి తీసుకెళ్లి, చీరతో గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి కాల్చివేశాడు.
ఆమె బంగారు గొలుసును తీసుకుని, సుండుపల్లి కీర్తన ఫైనాన్స్ వద్ద రూ. 1,31,000/- కు ముట్టజెప్పి, డబ్బును ఖర్చు చేశాడు.
📌 అరెస్టు:
పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో, అతడు స్వచ్ఛందంగా గ్రామ రెవెన్యూ అధికారి గంగసాని శ్రీనివాసులుకు లొంగిపోయాడు. వీఆర్వో ఆయనను పోలీసులకు అప్పగించగా, 24.08.2025 సాయంత్రం 4:30 గంటలకు అధికారికంగా అరెస్టు చేశారు.
📌 ఎస్పీ హెచ్చరిక:
జిల్లా ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరం చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి , రాయచోటి రూరల్ సీఐ ఎన్. వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ వి.సుధాకర్, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List