ప్రభుత్వాలు పాలకులు మారిన తీరని డ్రైనేజీ సమస్యలు.

On

IMG-20250913-WA0009

మెట్ట వద్ద డ్రైనేజీ సమస్య తీరేది ఎప్పుడో..?

దోమలకు ఆవాసంగా డ్రైనేజీ కాలువలు..

ప్రబలుతున్న వ్యాధులు.. భయోందళనలో  ప్రజలు.

పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన అధికారుల చర్యలు శూన్యం..

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని పలు విధుల్లో డ్రైనేజీ కాలువలు మురుగు పారుదల లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రజల అవస్థలు వర్ణాతీతం. అదేవిధంగా మెట్ట యందు డ్రైనేజీ సమస్యతో ప్రతిరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ మురుగు కాల్వ ముందుకు సాగే విధంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపై  ప్రవహించడంతో ప్రజలు తీవ్ర  అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీ మురుగు నీరు ముందుకు సాగే విధంగా లేకపోవడంతో ఇళ్లల్లోకి వచ్చి తీవ్ర అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వాలు పాలకులు మారిన డ్రైనేజీ సమస్య గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు. డ్రైనేజీ కాలువ లేక సీజన్‌తో సంబంధం లేకుండా మురికినీరు రోడ్డుపై నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది.దీంతో నిత్యం ప్రజలు దుర్వా సనతో, రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేవారు లేరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక పారే మురికి నీటిలో దోమలకు ఈగలకు ఆవాసాలుగా మారి దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.ఈ అస్తవ్యస్త డ్రైనేజీ కారణంగా స్థానికులు ప్రతి రోజూ మురుగు నీటి మధ్య సహజీవనం సాగిస్తున్నారు. దీంతో రోగాలకు గురవుతున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ప్రజలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు మురుగు నీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.డ్రైన్లు అసంపూర్తిగా ఉండటంతో డ్రైనేజీ మురుగునీరు పారుదల ముందుకు సాగే విధంగా లేకపోవడంతో, ఎక్కడి నీరు అక్కడే నిలబడి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీ లోని మురుగునీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీంతో దోమల దోమల విజృంభన ఎక్కువైంది. ఈ డ్రైనేజీ మురుగునీరు నిలబడిపోవడంతో, దోమలు బాగా వృద్ధి చెంది, రోగాల బారిన  పడుతున్నారని తెలిపారు.గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం మాత్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదు అని చర్చించుకుంటున్నారు. నంద్యాల- గాజులపల్లె రహదారిలోని ఆర్ అండ్ బి అధికారులు నిర్మించిన డ్రైన్లు అసంపూర్తిగా నిర్మించడంతో, మురుగునీరు  నిలబడి పోవడంతో స్థానికులు  నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా చెత్త చెదారంతో   పేరుకో పోయి దోమలకు ఆవాసంగా  మారి మలేరియా, డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని  వాపోతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ మురుగునీరు పారుదల ముందుకు సాగే విధంగా  చర్యలు చేపట్టాలని  కోరుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News