నంద్యాల జిల్లాలో 131 డిఏపి బస్తాలు సీజ్
గాజులపల్లెలో 131 డిఏపి బస్తాలు సీజ్
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం నందు ప్రభుత్వం నిర్ణయించిన డిఎపి ధర రూ.1350 కాగా 1400 రూపాయలకు అమ్మినట్లు అధిక ధరకు విక్రయించినట్లుగా నిర్ధారించుకొని ఈసీ ఆక్ట్ 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం 6ఏ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.సదరు దుకాణం నందు 176,850 రూపాయల విలువగల డి ఏ పి ఎరువులు సీజ్ చేయడం జరిగిందన్నారు.మరియు రూ.10926 యూరియా ఎరువులు అమ్మకాలు నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు.తదుపరి చర్య నిమిత్తము ఉన్నతాధికారులకు 6ఎ కేసు రిపోర్టు పంపిస్తామని తెలిపారు.ఈ తనిఖీలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ వెంకట ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు.
Comment List