అనంతపూర్ లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు సెప్టెంబర్ 11 ప్రతినిధి
కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల హామీలు పూర్తి చేసి నేపథ్యంలో బుధవారం అనంతపురంలో జరుపుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపూర్లో జరిగిన కూటమి ప్రభుత్వ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఇంకా చాలామంది సభ ప్రాంగణానికి చేరుకోలేక పోయారని సభ ఎంతో విజయవంతమైనట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలో వైసిపి తెచ్చిన మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించడంతో దాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించే ధోరణిలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఖండించారు రాష్ట్రంలో తిరిగి వైసిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీకి రాని జగన్ అధికారంలోకి కూడా రాడని చేర్చి చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ ఎందుకు ఇంత చిత్తుగా ఓడిపోయామని జగన్ సమీక్షించిన పాపను పోలేదని అన్నారు. ఇప్పటికీ జగన్ లో ఎలాంటి మార్పు రాలేదని ఆయనను కలవడానికి వచ్చిన ప్రజలకు పాసులు ఏర్పాటు చేయడమేంటిని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి వై ఉండి ప్రజలతో మాట్లాడడానికి ఏమి ఇబ్బంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒకసారి ప్రజలను ఎంతమంది వచ్చినా కలుసుకుంటారని అన్నారు. ప్రజలు కలవాలన్న పాసులు ఏర్పాటు చేసే జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. జగన్ పై కేసులు ఉన్న కారణంగా వైసీపీని ఓడించిన ఎన్డీఏకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు తెలిపారని విమర్శించారు. నిన్న జరిగిన అనంతపూర్ సభలో తామెవ్వరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోవాలాలకు ప్రతి సంవత్సరం 15000 ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఎందుకంటే స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించడంతో చిన్నచిన్న ఆటోవాలాలు నష్టపోతున్నారు అన్న భావనతో ఈ పథకాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రంలో ఆటోవాలాలను గుర్తించి వారందరికీ దసరా రోజున నగదు జమ చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉంది అనడం సరికాదన్నారు గత నెల క్రితం ఎరువులు కొరత ఉందని దుష్ప్రచారం తో రైతులు అవసరానికి మించి యూరియాను తీసుకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమన్నారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని సమృద్ధిగా యూరియా దొరుకుతుందని తెలిపారు. గత సంవత్సరం కంటే 30% అధిక ఎరువులు రాష్ట్రానికి వస్తున్నాయని కావున రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికా వద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి ఎస్ ముక్తియార్, గంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comment List