కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
On
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక):
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రజల వినతులు స్వీకరించేందుకు ముందుండగా, కాశినాయన మండలంలో మాత్రం పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రతి సోమవారం మండల కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Oct 2025 10:31:15
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు

Comment List