టిఎన్సీ నాగేంద్ర, సీవో చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26 డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు తన స్వంత డబ్బు రూ.28వేలు ఫోన్ ఫే చేశానన్నారు. నాపైన అసత్య ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందని వారు ఇలా చేయడంతో నిజానిజాలు చెప్పాల్సి వచ్చిందని తనతోపాటి చాలామంది యానిమేటర్లు చెప్పుకోలేక నలిగిపోతున్నారన్నారు. ఇప్పుడు ఈ నిజాలు చెప్పినందుకు తనను టీఎన్సీ నాగేంద్ర, సీవో లావణ్య ఏమంటారోనని భయంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల స్త్రీనిధి సొమ్ము అడిగితే గతం గతః అనడం సీవో లావణ్య తప్పు అన్నారు .గ్రామీణ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకులోకి బలవంతంగా ఖాతాలు మళ్ళించడం వెనుక సీవో లావణ్య ఆంతర్యం తనకు తెలియదని బ్యాంకు అధికారులతో కూడా తమను మాట్లాడనీయకుండా లావణ్య మాత్రమే మాట్లాడుతుందని హైమావతి అన్నారు.
Comment List