నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు

On

కోటేష్ ప్రతిభ

992a95bf-2a8f-4b1f-a990-28b679ab86a5పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు

నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 26 . (నంది పత్రిక ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని పెన్ను క్యాప్ పై మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్ తో 60 సూక్ష్మ వినాయకులను వివిధ రూపాలతో   2 గంటల వ్యవధిలో అద్భుతమైన చిత్రాన్ని వేసి అబ్బుర పరిచారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుండి ప్రతి వినాయకచవితి పండుగకు గణేశుని చిత్రాలను వేస్తున్నాను అని తెలిపారు. ఈ సారి పెన్ను క్యాప్ పై సూక్ష్మ వినాయకులను వేశానన్నారు. ఈ చిత్రంలో గణనాధుడు భక్తులకు అభయ మిస్తున్నట్లు, ఓం ఆకారంలో గణపతులు, శంకు ఆకారంలో గణేశుడు, కాణిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్యభంగిమ లో గణపతి.ఇలా అనేక రూపాలతో 60 సూక్ష్మ గణనాధుల చిత్రాలను వేశారు. అనేక రూపాలతో దర్శనమిచ్చిన స్వామిని తన వాహనమైన ఎలుక స్వామిని భక్తితో మొక్కుతున్నట్లు కూడా వేశారు. స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. గణపతి,. గజా ననా,గణేశుడు, విఘ్న్నే శ్వరుడు, లంభోదరుడు, ఏకదంతుడు, వక్రతుండ, బొజ్జ గణపయ్య, మహాకాయ ఇలా అనేక నామధేయుడుస్వామి.ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత వుంది.గణపతి అంటే గణాలకు ఆధిపతి,గజననా అంటే ఏనుగు ముఖం కలవాడు,ఏకదంత అంటే ఓకే దంతం కలవాడు. విఘ్న్నే శ్వరుడు అంటే విఘ్నలను తొలగించేవాడు. ఇలా అనేక పేర్లతో స్వామిని పిలుస్తారు. సకల దేవతలు స్వామి ని పూజిస్తారు.ఏ కార్యక్రమం తలపెట్టిన ఏ పూజ చేసిన ముందుగా గణేశుని పూజించాలి.అందరికి వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు. భక్తులందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.