నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
-రైతులు పంటకు అవసరం మేరకు యూరియా వాడాలి
-
నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 25 . (నంది పత్రిక ):జిల్లాలో రైతుల పంట పొలాల వినియోగార్థం యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని అవసరం మేరకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో యూరియా నిల్వలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....జిల్లాలో రైతుల అవసరం మేరకు 40,363 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. యూరియా నిల్వల పర్యవేక్షణ కోసం జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, తహశీల్దార్లు ఆధ్వర్యంలో టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సదరు సిబ్బంది రైతు సేవా కేంద్రాలు, ఫెర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసి ప్రతి రోజూ రిపోర్టు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రూ.2267/- విలువ చేసే యూరియాను రైతుల శ్రేయస్సు కోసం సబ్సిడీ రూపంలో రెండు వేల రూపాయలు తగ్గించి కేవలం రూ.267/- కు అందజేయడం జరుగుతోందన్నారు. యూరియా నిల్వలు జిల్లాకు వచ్చిన వెంటనే నమోదు చేయడంతో పాటు అమ్మకాలు జరిపిన వెంటనే రైతులలో ఈ-పాస్ యంత్రంలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అదే విధంగా ఐఎఫ్ఎంఎస్ సైట్ లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయడం ద్వారా జిల్లాకు అవసరం మేరకు నిల్వలు రావడం జరుగుతోందన్నారు.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కు సంబంధించి శాఖల వారీగా నెల వారీగా, త్రైమాసికంగా, సంవత్సర వారీగా పెండింగ్ ఉన్న నివేదికలను సంబంధిత శాఖల ఈరోజు సాయంత్రంలోగా అప్లోడ్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.స్వచ్ఛత అవార్డులకు సంబంధించి జిల్లా పరిధిలో ఉత్తమంగా నిర్వహిస్తున్న కార్యాలయాలను ఎంపిక చేసి 55 స్వచ్ఛ అవార్డులను ఇవ్వడం జరుగుతుందని, అదే విధంగా రాష్ట్రంలో ఇచ్చే అవార్డులకు కూడా సిఫార్సు చేయడం జరుగుతోందన్నారు. స్వచ్ఛ అవార్డులకు సంబంధించి ఎంపికైన వారికి చెకింగ్ చేయడంతో పాటు అక్టోబరు 2వ తేదీన అవార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు.
Comment List