సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్

On

తమిళ నటుడు సూరి ఒకప్పుడు రోజుకూలీగా పని చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెప్పారు. కేవలం రూ. 20 కోసం రోజంతా కష్టపడేవాడినని ఆయన తెలిపారు. హాస్యనటుడిగా ఉన్న సూరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడం కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఆగష్టు 27న సూరి పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకుంది.
సూరి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కీర్తి సురేష్ పంచుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 'లవ్ యూ డా తంగాచ్చి (సోదరి)' అంటూ సూరి కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. మామన్నన్ (2023)లో విడుదలైన ఈ మూవీలో నటించారు. కీర్తి సురేష్ తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అంటూ సూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
1998లో తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సూరికి మొదట పెద్దగా గుర్తింపు లేని పాత్రలే దక్కాయి. అయితే, 2009లో విడుదలైన 'వెన్నిల కబాడి కుజు' చిత్రం తనకు గుర్తింపు తెచ్చింది. సుమారు పదేళ్ల పాటు తన కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీతోనే తనకు 'పరోట్ట సూరి' అనే గుర్తింపు వచ్చింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ సినిమా వల్ల తన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత గరుడన్, మామన్ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం 'మందాడి' అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.IMG_6756

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.