నంద్యాల చిన్నచెరువు లో పూడికలు ,వ్యర్థాలు తొలగించండి

On

19e56a6e-cc23-4cf9-a082-bc2409ab64ab.
.. ఆగస్ట్ లో వినాయక చవితి పండుగా.
...పూడికలు పేరుకుపోవడంతో ,నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలు నీటిలో తేలుతున్నాయి.
...పూడికలు ఆ ప్రాంతంలో తీయాలని భక్తులు కోరుతున్నారు.
నంద్యాల ప్రతినిధి. జూలై 22 . (నంది పత్రిక ):
          నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు పూడికలు,వ్యర్థాలతో నిండిపోయింది.చిన్న చెరువు లో గత 10 ఏళ్లుగా పూడికలు తొలగించలేదని ప్రజలు,భక్తులు పేర్కొంటున్నారు.వందల ఎకరాల్లో చిన్న చెరువు ఉన్న అభివృద్ధి చేయడానికి ఆ శాఖ అధికారులకు,నేతలకు కనిపించడం లేదు.చెరువులో పూడికలతో పాటు చెట్లు ,వ్యర్థాలతో నిండిపోయింది.చెరువు సైతం కొంత ఆక్రమణకు గురైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెరువు సమస్య పరిష్కరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను కలిస్తే నిర్లక్ష సమాధానం వస్తుంది.ప్రజలన్నా,రైతులన్నా ఆ అధికారికి ఎందుకో అంత కోపం.ఇటీవల రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో సైతం అధికారిపై రైతులు పిర్యాదులు చేశారు. ఆగస్ట్ నెలలో వినాయక చవితి పండుగ ఉంది.పండుగ అయిపోయిన తర్వాత వినాయక నిమజ్జనం ఉంటుంది.అంగరంగ వైభవంగా  నిమజ్జనం జరుగుతున్నా ,విగ్రహాలు నిమజ్జనం చేస్తే పూడికలు తొలగించకపోవడంతో విగ్రహాలు నీళ్ళ పై తేలియాడుతూ ఉంటాయి.వేసవి కాలంలో నీళ్ళు లేనప్పుడు పలుమార్లు అధికారుల వద్దకు వెళ్ళినా పలితం కనిపించలేదని కొందరు భక్తులు కె.ఎస్.కె.న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు.వర్షాలు పడటం వాళ్ళు చిన్న చెరువులో నీళ్లు ఉన్నాయి.నిమజ్జనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఆ ప్రాంతంలో పూడికలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.గతంలో అపర ధన కర్ణుడు ,మాజీ ఎంపీ,దివంగత నేత ఎస్.పి.వై.రెడ్డి సొంత నిధులతో చిన్న చెరువు లో పూడికలు తొలగించే పని మొదలు పెట్టడంతో ప్రజలు సంతోషించారు.పట్టు మని పది రోజులు అయిందో లేదో ఒక రాజకీయ నాయకుడికి స్వార్థం పెరిగింది.చిన్న చెరువులు పూడికలు తొలగిస్తే ఆయనకు పేరు వస్తుందని ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నాయకులకు చెప్పి పూడికలు తొలగించకుండా చేయడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది.రాజకీయ నాయకులు,అధికారులు ఇప్పటికైనా చిన్న చెరువులో పూడికలు రాజకీయాలకు అతీతంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.