జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు,ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి

On

IMG-20250805-WA0003

నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 05 . (నంది పత్రిక ):రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు,ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు.మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఐరా లోని పాత్రికేయులందరూ జర్నలిస్ట్ ల కోర్కెల దినం(డిమాండ్స్ డే) సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.సందర్భంగా ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన కూడా అర్హులైన పాత్రికేయులకు నేటికీ క్రొత్త అక్రిడేషన్ లు ఇవ్వలేదని,ప్రభుత్వం మూడు మాసాలకు ఒకసారి పొడిగిస్తూ వస్తుందని ఈసారి పొడిగించకుండా క్రొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయ ప్రకాశ్ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ ల సమస్యల కోసం పని చేస్తుందని ఆశించామని అన్నారు.
అయితే ఆశించిన స్థాయిలో ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు మరియు సంక్షేమం కోసం పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా క్రొత్త అక్రిడేషన్ లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తుందన్నారు.గత ప్రభుత్వం వల్ల ఎంతో మంది అర్హులైన పాత్రికేయులు అక్రిడేషన్ సౌకర్యం కోల్పోయారని,
ఈ కూటమి ప్రభుత్వం రాకతో అందరికీ కొత్త అక్రిడేషన్ లు వస్తాయని ఆశించారని అన్నారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన,కొత్త అక్రిడేషన్ లు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదు అన్నారు.అదేవిధంగా అర్హత ఉండి కూడా చాలా మంది జర్నలిస్టులు అక్రిడేషన్ నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అక్రిడేషన్ కావాల్సివస్తోందని అన్నారు.కనుక కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి,ఆక్రిడేషన్ లను రెన్యువల్ చేయకుండా కొత్త అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే జర్నలిస్ట్ లకు  యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, యాంటీ అటాక్ కమిటీలు వెంటనే వేయాలని వారు కోరారు.
అంతే కాకుండా రాష్ట్రంలోని పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షగా మారాయన్నారు.గతంలోని ప్రభుత్వాలు ఎన్నికల ముందు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీఓ లు విడుదల చేసిన, ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్ల స్థలాల అంశం  మరుగున పడిందన్నారు. ఈసారి అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు,ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. అలాగే దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలు 50 సంవత్సరాలు నిండిన ప్రతి పాత్రికేయునికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా జర్నలిస్టులు అందరికీ అదే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక జీ.ఓ ను విడుదల చేయాలన్నారు.వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలన్నారు.
జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అక్రిడేషన్ కమిటీలో అన్ని యూనియన్ల ప్రాధాన్యత కల్పించాలన్నారు.జర్నలిస్టులందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి,ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సమానత్వాన్ని పాటించాలన్నారు.
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు 50 లక్షల విలువతో కూడిన హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న  పెద్ద అని తేడా లేకుండా ఆర్ఎన్ఐ కలిగిన పతి పత్రికకు అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువ బాబు,గౌరవ సలహాదారులు జయప్రకాష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ బాబు,రాష్ర్ట ఉపాధ్యక్షుడు విజయ్ బాబు,జిల్లా అధ్యక్షులు లెజండ్ శ్రీను,జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా రావు, సీనియర్ పాత్రికేయులు విజయానంద్ మరియు పవన్ లు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.