యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ
జూపాడుబంగ్లా జూలై 26 (నంది పత్రిక) మండల కేంద్రంలోని గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకముగా విద్యార్థులతో కలిసిఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరగడం విద్యార్థులు యువత వాటి బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. లాంటి మత్తు పదార్థాలను సేవించి తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని. ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని. కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాలు చవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఒక కలగానే మిగిలిపోతుంది అన్నారు. ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు మారడంతో తల్లిదండ్రు ఇలాంటి వేదనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని యువత గ్రహించాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత శారీరికంగాను మానసికంగాను తీవ్రంగా బలహీన పడిపోతారని భవిష్యత్తు నాశనం అవుతుందని అటువంటి దురలవాట్లకు దూరముగా ఉండాలని హితువు పలికారు .ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన సమాచారం అందించడం ద్వారా వారిపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిని తరిమి కొట్టవలసిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. గంజాయి మత్తు పదార్థాల పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యముగా ఉంచడం జరుగుతుందన్నారు.ఎస్సై ఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List