శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై పుస్తకాల ముద్రణ
మహానంది జూలై 20 (నంది పత్రిక):-
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై భక్తులు పుస్తకాలు ముద్రించారు.హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్ రావు,విజయలక్ష్మి దంపతులు,వారి కుమార్తెలు తంగిరాల హరికృష్ణ, కామేశ్వరీ కమల మాధవి, శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి, రాధలతో కలిసి వారి కులదైవం అయిన మహానందిలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి వైభవంపై ‘శ్రీ కామేశ్వరి వ్రతకల్పం, పూజా విధానం’ పుస్తకాన్ని ముద్రించారు. దీనిపై ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని అభినందించారు.ఆదివారం మహానందిలో ఆ పుస్తకాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు.పుస్తక ముద్రణ దాతలు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు అని అన్నారు.గత 170 సంవత్సరాలుగా మా కుటుంబీకుల ఇలవేల్పు అన్నారు.అమ్మవారి వైభవాన్ని, మహిమలను అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో పుస్తకాలు ముద్రించామన్నారు.
Comment List