ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్
పొలం ఆన్లైన్ ఎక్కించేందుకు 50,000 లంచం డిమాండ్. జూపాడుబంగ్లా రైస్ మిల్లు దగ్గర డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
జూపాడు బంగ్లా జులై 31 (నంది పత్రిక) జూపాడుబంగ్లా మండలంలో ఆత్మకూర్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ అనే వ్యక్తిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సీఐ కృష్ణయ్య ఎస్సై సుబ్బరాయుడులు గురువారం సీనియర్ అసిస్టెంట్ ప్రత్యక్షంగా లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూపాడు బంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామ పొలిమేరలోని సర్వేనెంబర్ 568 లో గల ఒక ఎకరా భూమి తన తల్లి శంకరమ్మ పేరుతో ఆన్ లైన్ లో ఉండగా ఆమె మరణించడంతో వారసత్వంగా ఆమె కుమారుడు ఈశ్వరయ్య పేరు మీద ఆన్ లైన్ చేయవలెనని స్థానిక అధికారుల చుట్టూ తిరిగిన లాభం లేకపోవడంతో ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ ను సంప్రదించడం జరిగింది. పొలమును ఈశ్వరయ్య పేరుతో ఆన్ లైన్ చేయాలంటే 50 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అందుకు అంగీకరించిన రైతు పదివేల రూపాయలను ముందుగానే ఇవ్వడం జరిగిందని ఏసీబీ అధికారులకు సీనియర్ అసిస్టెంట్ రమేష్ తెలిపారు. 40 వేల రూపాయలను ఈరోజు ఇచ్చేందుకు రైతు అంగీకరించడంతో ఇక్కడ వచ్చి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్40 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న కర్నూల్ ఏసీబీ డిఎస్పి సోమన్న బృందం ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
Comment List