Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?

On

Bananas | అరటి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగితే సమస్యలొస్తాయా? ఇందులో నిజమెంత?

images (18)

Bananas |(నంది పత్రిక)అక్టోబర్ 13. అరటి పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కాలమేదైనా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది అరటి పండ్లను కొని తింటుంటారు. అయితే, పండ్లపై చాలా మందిలో ఓ సందేహం వ్యక్తమవుతుంది. అదేంటంటే.. అరటి పండ్లను తిన్న అనంతరం మంచినీళ్లు తాగొచ్చా? ఒక వేళ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఏమైనా అవుతుందా? అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. అరటి పండ్లను తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయనడంలో అర్థం లేదని పేర్కొంటున్నారు. పండ్లను తిన్న తర్వాత నీళ్లను నిరభ్యంతరంగా తాగొచ్చని, తిన్న తర్వాత నీళ్లను తాగితేనే మంచిదంటున్నారు. రోజుకు ఒకటి, రెండు అరటి పండ్లను తినొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అరటి పండ్లు సులువుగా జీర్ణమవుతాయి. తిన్న కేవలం గంటలోపే వీటిలో ఉండే పోషకాలన్నింటిని శరీరం శోషించుకుంటుంది. తక్కువ సమయంలో పోషకాలు, శక్తి లభించాలంటే అరటి పండ్లను తప్పకుండా తీసుకోవాలి. అరటి పండ్లను పొటాషియం అధికంగా ఉంటుంది. మీడియం సైజ్‌ పండును తీసుకుంటే 420 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. రోజుకు రెండు పండ్లను తీసుకుంటే హైబీపీ అదుపులోకి వస్తుంది. బీపీ తగ్గించడంలో పొటాషియం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు సైతం ఆరోగ్యంగా ఉండి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రోజున అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన...
జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి
ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక
నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్
సమాచార శాఖ డీఐపిఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం 
భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి.. సిపిఐ