గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల  జాగ్రత్త వహించలి

On

గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల  జాగ్రత్త వహించలి

IMG_20241022_190235

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 22 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా ఆర్ వెంకటరమణ తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని,మహానంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికముగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది సమయ పాలన తప్పని సరిగా పాటించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీ లో భాగముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లోని ఒపి విభాగాన్ని మరియు అక్కడ వున్నటువంటి రోగులకు, వారికి అందె సేవలు మరియు చికిత్సలు,మందులు, వారి పట్ల వైద్యాధికారి మరియు వైద్య ఆరోగ్యసిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు. మరియు ఒపి విభాగ్యములోని రికార్డులను మరియు రిపోర్టులను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రములో జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ఐఈసి  మెటీరియల్ ప్రదర్శన ను అవగాహన కొరకు ప్రజలకు మరియు రోగులకు అందుబాటులో ఉండే విధముగా ప్రదర్శించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. కాన్పు వార్డును ఆపరిశీలించి కాన్పు కొరకు వచ్చే ప్రతి గర్భిణీ స్త్రీ ని వీలైనంత వరకు నార్మల్ కాన్పు అయ్యే విధముగా జాగ్రత్త వహించవలేనని మరియు మాతాశిశు సంరక్షణ చర్యలు తీసుకోవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. బాలింత స్త్రీ కి మరియు పుట్టిన బిడ్డకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టవలేనని మరియు వారికి , కార్యక్రమాల క్రింద రావలసిన రాయితీలు సరైన సమయములో అందించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. మందుల గదిని తనిఖీ చేసి అందులో రికార్డులను పరిశీలించడం జరిగినది .ల్యాబ్ ను,వ్యాధినిరోధకాల గదిని తనిఖీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశాలు జారీచేయడమైనది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.