పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్

On

GridArt_20250519_083017103

నంది సినిమా పత్రిక

పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్

ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

విలక్షణమైన కథతో రూపొందనున్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి అధికారికంగా టీమ్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో సర్ప్రైజ్

ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక కూడా ఓ కీలక క్యారెక్టర్లో నటించనుందని తెలిసింది.

ఇప్పటికే తను పూరీ - విజయ్ సేతుపతిల ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే ఈ విషయాన్ని పూరి టీమ్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. క్రేజీ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం..  క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం.. 
రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్కర్నూలు నంది పత్రిక..........క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు జులై 2వ తేదీ నుండి విమాన సౌక‌ర్యం ప్రారంభమ‌వుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్...
పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి
అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 
పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్
నిలిచిన రోడ్డు విస్తరణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు
కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి
దేశ భక్తి ఉట్టిపడేలా నంద్యాలలో తిరంగా యాత్ర