Balakrishna: వరుస రికార్డులతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది: బాలకృష్ణ

On

IMG_20250131_230447

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్: సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొని.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు.

'డాకు మహారాజ్.. ఆ హీరోకు సెట్ అవుతుంది: ప్రజ్ఞా జైస్వాల్

"నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బిరుదుల కోసం కాదు. మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఉపయోగపడితే మనం ఏదైనా సాధించవచ్చు. పద్మభూషణ్ ఎప్పుడో రావాల్సిందని ఎంతోమంది అంటున్నారు. నేను ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. పనే నాకు దైవం. నాన్నగారి వందో జయంతి ఇటీవలే పూర్తైంది. ఆయన నటించిన 'మనదేశం' విడుదలై 75వ సంవత్సరాలు కావడం.. ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం.. విడుదలైన నాలుగు చిత్రాలు హిట్స్ అందుకోవడం.. ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి, ఆలస్యం ఏమీ కాలేదు. ఎంతోమంది నటీనటులు కొన్నేళ్లపాటు లైన్లైట్లో ఉండి.. ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రలు పోషిస్తుంటారు. కానీ, ఆ కళామతల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా.

 

ఈ పురస్కారం నన్ను వరించడంపై అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇది తమకే వచ్చిందని భావిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అంతటి ప్రేమాభిమానాలను పొందడం నిజంగానే నా పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అనుకున్నా మనకు నచ్చినవిధంగా ముందుకు సాగిపోవాలి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి త్వరలోనే 15 ఏళ్ళు అవుతోంది. అందుకు సంతోషంగా ఉంది. ఈ ఆస్పత్రి ఇంతటి పేరు ప్రఖ్యాతులు అందుకుందంటే అది అందరి సమష్టి కృషి" అని బాలకృష్ణ చెప్పారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.