శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు 

On

మానసిక వ్యాధుల వైద్యురాలు డాక్టర్ ఓంకారం సింధుజ

IMG_4173

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 10 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవo అనే కార్యక్రమాన్ని నంద్యాల నంది పైపులు ఫ్యాక్టరీ నందు శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వారు నంది పైపులు ఫ్యాక్టరీ నందు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రముఖ మానసిక వ్యాధుల వైద్యురాలు డాక్టర్ ఓంకారం సింధుజ ఆధ్వర్యంలో నిర్వహించారు.మీ ఉద్యోగ స్థలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వలని".మానసిక ఆరోగ్యానికి అవగాహన పెంచడం, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం అన్నారు.ఉద్యోగ స్థలాల్లో ఒత్తిడి, నిరుత్సాహం వంటి సమస్యలు అనేక మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయన్నారు.ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను పక్కన పెట్టడం కాదు, వాటిని గుర్తించడం ముఖ్యం,మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.మీరు ఏ స్థితిలో ఉన్నా, మీ మానసిక ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి.ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ఆరోగ్యకరమైన, సానుకూలమైన ఉద్యోగ వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రేరణగా మారాల న్నారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ లు డి కిషోర్ బాబు వైవి రమణ లు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.