ఆయుర్వేద ఆసుపత్రికి మంచిరోజులు వచ్చేనా

On

ఆయుర్వేద ఆసుపత్రికి మంచిరోజులు వచ్చేనా

 జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

శబరమ్మా..మీరైనా పట్టించుకోండి

రోజుకు 200పైగా రోగులు

ఆయుర్వేదంలో పంచకర్మ పద్దతి అమలు

IMG_20241016_215538

నంద్యాల (నంది పత్రిక) అక్టోబర్ 16:   

మందులు అన్ని ఉన్నాయి ఉచితంగా ఇస్తున్నాం..డా క్టరు యశోద గతంలో ఎంపికయిన ఎంపిలు పట్టించుకోకపోవడం వల్ల నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆయుష్పు వైద్య కార్యాలయాలకు స్వంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మీరైనా జోక్యంచేసుకుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలాన్ని కేటాయించి భవనాలను నిర్మించాలని ఆయుష్నుఅభిమానులు నంద్యాల ఎంపి బైరెడ్డి శబరిని కోరుతున్నారు..ప్రధానమంత్రిగా పదిసంవత్సరాల క్రితం నరేంద్రమోడి భాద్యతలు తీసుకున్న తరువాత ఆయుషు్ విభాగాలను భారీగా అభివృద్దిచేస్తూ నిదులు కేటాయిస్తూవస్తున్నారు..అయితే నంద్యాల నుండి ఎంపికయిన ఎంపిలు మాత్రం పెద్దగా శ్రద్ద చూపక పోవడంతో ఆయుష్పు పరిదిలోకి వచ్చే ఆయుర్వేద వైద్యశాల నిరాదరణకు గురవుతున్నది…2014 నుంచి 2019వరకు కొనసాగిన టిడిపి హయాంలో నంద్యాల లోని ఆయుషు విభాగంకోసం 5 సెంట్ల స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించే ప్రయత్నం సాగింది..ఆతరువాత వైసిపి అధికారంలోకి వచ్చినా ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు..ప్రస్తుతం మంత్రి పరూఖ్ , ఎంపి బైరెడ్డి శబరి సంయుక్తంగా నూతన భవనాలను నిర్మాణంకోసం కృషిచేయాలని ఆయుర్వేద అభిమానులు కోరుతున్నారు..ఆయుర్వేద వైద్య శాలతోపాటు హోమియో , యునాని , ఆసుపత్రులుకూడా ఇదే భవనాలలో కొనసాగవచ్చని వారంటున్నారు..ప్రస్తుతం మంచి వైద్యులు ,సిబ్బంది ఉన్నప్పటికి ప్రభుత్వ ఆసుపత్రిలోని భవనాలలో ఈ వైద్య శాలలు కొనసాగుతున్నాయి..వారికి అవసరమైన భవనాలు లేకపోవడంతో వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు..పంచకర్మ పద్దతిని అమలుచేస్తూ యోగా కూడా కొనసాగించాలని అందువల్ల ప్రత్యేక భవనం అవసరమని అదికారులు అంటున్నారు..జిల్లాకేంద్రం కావడంతో ప్రస్తుతం ఈ మూడింటికి 200 నుంచి 300 మంది రోగులు పస్తున్నారని వారికోసం 20 పడకల ఆసుపత్రికూడా అవసరమని ఆయుర్వేద అభిమానులు పేర్కొంటున్నారు..ఈవిషయాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు యశోద దృష్టికి తేగా నంద్యాలనుండి ఎన్నికయిన ప్రజాప్రతినిదులు బాగాస్పందిస్తున్నారని త్వరలో మంచిరోజులు రావచ్చని అన్నారు..ప్రతిరోగానికి అవసరమయిన మందులు తమ దగ్గర ఉన్నాయని అతి ఖరీదైన పంచకర్మ పద్దతిని ఉచితంగా అమలుచేస్తున్నామని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు….

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ