కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి
-కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలి
నంద్యాల ప్రతినిధి. జూలై 12 . (నంది పత్రిక ):రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ లలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకొని కార్మికులకు సహకరించాలని కోరారు ప్రజలకు నీరు అందకపోవడం వీధిలైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి ప్రజా ప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని,ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్,కే మహమ్మద్ గౌస్ లతోపాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరి కొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికుల అందరికీ 21 వేల రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24 వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని, పది సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75 వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికుల కు పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 20 వేల రూపాయలు ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ లను పెంచాలని కోరుతూ గత ప్రభుత్వాయంలో ఒప్పుకున్న హామీలకు వెంటనే జీవోలను విడుదల చేసి కార్మికులను కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆప్కాస్ ని రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయంలో 22 రోజుల సమ్మె కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని టెంట్ ల దగ్గరికి వెళ్లి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు హామీ ఇవ్వడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన ఇంజనీరింగ్ కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పులు జరగడంలేదని సమస్యలను పరిష్కరించమంటే నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికుల అందరికీ వర్తించేలాగున జీవో వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే తల్లికి వందనం అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని వెంటనే తల్లికి వందనం కూడా ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అందేలాగున చూడాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పినారని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు పట్టణమంతా ప్రజలకు మంచినీరును విడుదల చేయడంలోనూ విద్యుత్ అంతరాయం కలగకుండా చేయడంలోనూ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అటువంటి కార్మికులకు కుటుంబాలలో ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం కోసము తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని సమస్తరం నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇదేవిధంగా ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఇంజనీరింగ్ కార్మికులు చేయాల్సిన పనులను నిలిపివేశామని, ఇప్పుడు ప్రజలకు నీరు కరెంటు ఇతరత్రా ముఖ్యమైన పనులను నిలిపివేస్తామని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడుతుందని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Comment List