ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక

On

దివ్యాంగుల, వృద్ధుల కోసం  ప్రత్యేక శిబిరాలు ఉపయోగించుకోండి.

 

faa2a9eb-6111-44c0-ad8c-eda5c5dfbaa2ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక


*  దివ్యాంగుల, వృద్ధుల కోసం  ప్రత్యేక శిబిరాలు ఉపయోగించుకోండి.

నంద్యాల ప్రతినిధి. జూన్ 25. (నంది పత్రిక ):దివ్యాంగులు,  వృద్ధులకు అవసరమైన సహాయాలు, ఉపకరణాలు సాయపరికరాలు ఉచితంగా అందించేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ శిబిరాలను ప్రారంభించేందుకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఈ నెల 26 వ తేదీన నంద్యాలకు రానున్నారు.కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధిప్ పథకం కింద, ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఈనెల 26వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాలులో దివ్యాంగులు, వృద్ధుల ప్రత్యేక శిభిరంను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభిస్తారు.అలాగే ఈ నెల  28వ తేదీ నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో, జులై 1వ తేదీ ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో, జూలై 4వ తేదీ ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో, జూలై 8వ తేదీ బనగానపల్లి మండల పరిషత్ కార్యాలయంలో,జూలై 11వ తేదీ డోన్ మండల పరిషత్ కార్యాలయంలో, జూలై 15వ తేదీ పాణ్యం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు  కొనసాగుతాయి.ఆడిప్ పథకం ద్వారా ఉచితంగా ఇవ్వనున్న సహాయ పరికరాలు ( బ్యాటరీ ఆధారిత మోటారు ట్రై సైకిల్, చేతితో నడిపే ట్రై సైకిల్, వీల్ చైర్, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, కృతిమ అవయవాలు మొదలగు) ఈ పథకం కోసం దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, వృద్ధులు, అర్హులు అని సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫొటో సైజ్ కలర్ ఫొటోలతో అర్హులు ఈ ప్రత్యేక శిబిరంకు వచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే సహాయం అందుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.ఈ ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన సాంకేతిక నిపుణులను  నియమించారు.నంద్యాల జిల్లా లోని దివ్యాంగులు, వృద్ధులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.