రేపు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా.. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ఎం సి పి ఐ ( యు) 

On

IMG-20250615-WA0045

 మిడుతూర్ జూన్ 15 (నంది పత్రిక ) మిడుతూరు మండలానికి ఎత్తుపోతుల పథకం మంజూరు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్, ఎం సి పి ఐ (యు ) ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రం విడుదల చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఎం సిపిఐ(యు) జిల్లా కన్వీనర్ పి.లాజరస్ ఆధ్వర్యంలో కడుమూరు గ్రామంలో రైతులతో కలసి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో 24 గ్రామాలు 40,000 ఎకరాల మేట్ట భూములు ఉన్నాయి. మెట్టరైతులు కేవలం వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారని కరువు కాటకాలతో అప్పులు కట్టలేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళేడంజరుగుతుందన్నారు. పొలాన్ని నమ్ముకొని ఉన్న రైతులు ఒకే పంట మీద మొక్కజొన్న, పొగాకు, శనగ, కొర్ర,పత్తి, తదితర పంటలు సాగు చేసి అతివృష్టి అనావృష్టి వల్ల కరువు మండలాలు ప్రకటించిన రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు.2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం అధికారం వస్తే మిడతూరు మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని. నేటికీ 12 మాసాలైనా పట్టించుకోకపోవడం రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుంది అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరు చేసేంతవరకు గ్రామ గ్రామాన కరపత్రాలు పంచుతూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం నాడు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని న్నారు.ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఐ(యు) జిల్లా నాయకులు. మర్రి స్వామి, లింగాల శీను, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సోమన్న, ఎస్ శేఖర్, గ్రామ రైతులు బి శేషుజి, జీవన్, ఆంజనేయులు, దేవరం, దానమయ్య, సుంకన్న, భాస్కర్, గడ్డపోగు సుంకన్నా, సుదర్శనం, డేవిడ్ ,పెద్ద ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.