భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి.. సిపిఐ   

On

IMG-20250622-WA0031

జూపాడుబంగ్లా జూన్ 22 (నంది పత్రిక) మండల కేంద్రంలోని సిద్దేశ్వరం గ్రామంలో ఆదివారం శాఖ మహాసభ నిర్వహించడం జరిగినది. శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, జిల్లా నాయకులు రమేష్ బాబు హాజరయ్యారు. గ్రామ శాఖ మహాసభ నరసింహ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు సిపిఐ చేస్తుందని అన్నారు. పేదలకు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డు, పెన్షన్ తో పాటు కూడుగూడు విద్య వైద్యం అందించాలని భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ బాడుగలు కట్టలేక బాధపడుతూ ఉంన్నరన్నారు. మండల కేంద్రంలోని చాబోలు, సిద్దేశ్వరం గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం లింగాపురం గ్రామాల మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఇవ్వాలని అన్నారు. సిద్దేశ్వరం గ్రామానికి సిసి రోడ్లు మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యల కోసం సిపిఐ ముందుండి పోరాడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రాజు, సోమన్న, దేవదానం, శ్రీనివాసులు, బాల యేసు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు. గ్రామ కార్యదర్శి నరసింహ,సహాయ కార్యదర్శి శ్రీను లను ఎన్నుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.