శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి* 

On

కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో కలకలం… వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం*

GridArt_20250717_155602518

 నగరంలోని "శ్రీ చక్ర ప్రైవేట్" హాస్పిటల్‌ వద్ద గురువారం ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సరైన చికిత్స ఇవ్వకపోవడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద పెద్దఎత్తున హంగామా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

*జ్వరంతో చేరి.. ప్రాణం కోల్పోయిన అనిత*

 

అనంతపురం జిల్లా పామిడి మండలం చెందిన అనిత (24)కు ఈనెల 14న తీవ్ర జ్వరం వచ్చింది.కుటుంబసభ్యులు మంగళవారం ఆమెను కర్నూలు నగరంలోని శ్రీచక్ర ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి నుంచే అనిత పరిస్థితి విషమించిందని బంధువులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రాథమిక పరీక్షలు సరిగా చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇంట్లో అనిత స్పృహ కోల్పోయి పడిపోవడంతో భర్త హఠా ఉట్టిన భర్త ఆసుపత్రికి ఆస్పత్రి సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకోలేదు అని బంధువులు ఆరోపించారు. మీరు ఎక్కడ చూపించుకున్నారు అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఓపీ తీసుకురావాలని భర్తకు ఒత్తిడి చేశారు దీనితో భర్త ఓపి ఇంటిదగ్గర మర్చిపోయి రావడంతో ఇంటి దగ్గరికి వెళ్లి ఓపి తీసుకొచ్చే లోకమే మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. చివరికి బుధవారం సాయంత్రం అనిత మృతి చెందింది.

 

*ఆసుపత్రి ఆవరణలో ఆందోళన… ధ్వంసం*

 

మరణ వార్త తెలిసిన క్షణం నుంచే బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. గురువారం ఉదయం ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.తీరా సమాధానం రాకపోవడంతో కళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశారు. గాజులు పగలగొట్టి, కుర్చీలు విసిరేశారు. హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుంది.

 

*పోలీసుల హస్తక్షేపంతో ఉద్రిక్తత నియంత్రణ*

 

విషయం తెలుసుకున్న కర్నూలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బంధువులను శాంతింపజేసేందుకు పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులోకి రావడంతో బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

*పోస్టుమార్టం నివేదికపై అన్ని ఆశలు*

 

అనిత మృతికి గల నిజమైన కారణం ఏంటనేది పోస్టుమార్టం నివేదికతో వెల్లడవనుంది. మరోవైపు బంధువులు “సాధారణ జ్వరంతో మృతి ఎలా సంభవించగలదు?” అంటూ నిలదీస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ తెలిపారు. ఆసుపత్రి వైపు ఇంకా స్పందన రాలేదు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి*  శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి* 
కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో కలకలం… వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం*  నగరంలోని "శ్రీ చక్ర ప్రైవేట్" హాస్పిటల్‌ వద్ద గురువారం ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సరైన చికిత్స...
నగరానికి ‘న్యూ లుక్’ తేవాలి
రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.
కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి
సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...
రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు