దొంగలించి దొరికిపోయారు.

On

GridArt_20250614_131433082 (1)

 నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో నంద్యాల జిల్లా పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో
నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ
" గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు, నందికొట్కూర్ ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ , నందికొట్కూర్ సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానిస్టేబుల్ బాలకృష్ణ, కానిస్టేబుల్ 3309 ఓబయ్య , సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం, యేసుదాస్, చంద్రశేఖర్ కానిస్టేబుల్స్ గంగారం, చిన్న మద్దిలేటి, మాలిక్ బాష కృష్ణమ నాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు లు 2025 వ సంవత్సరము నందికొట్కూర్ టౌన్ లోని బాలజీనాగర్ లోని ఇంటికి వేసిన తాళాలు పగలకొట్టి ఇంటిలోని ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివ శంకర్, 28 సంవత్సరాలు తండ్రి వి. రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందరనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేట్ మరియు గుత్తికొండ పవనకుమార్, 32 సంవత్సరాలు తండ్రి  జి. బాలకోటయ్య,గాంధీనగర్, పాత గుంటూర్, గుంటూర్ జిల్లాలను నిన్నటి దినము అనగా వ 13.06.2025 తేది సాయంత్రం 500. గంటల సమయములో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకొని ఇద్దరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు, నందికొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని ఒక కేసుకు సంబందించి సుమారు 394 గ్రాముల బంగారు, 326 గ్రాముల వెండి ఆభరణములను ఒక ల్యాప్ టాప్, ను సీజ్ చెయ్యడమైనది. స్వాదినం చేసుకున్న బంగారు, వెండి మరియు లెనోవా, ల్యాప్ టాప్ ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయి . నందికొట్కూర్ పోలీసుస్టేషన్ కేసులో ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడమైనది. గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు గుంటూర్, కడప, కర్నూల్, నెల్లూరు, విశాకపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపూర్, అన్నమయ్య ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి దొంగతనము కేసులలో పాల్గొన్నారు. ఈ ముద్దాయిలు గతంలో చేసిన దొంగతములలో నెల్లూరు, కడప, గుంటూర్ జైళ్లకు కు పోయి వచ్చినట్లు తెలిపారు.
మొదటి వ్యక్తి వేముల శివ శంకర్ పై సుమారు 21 దొంగతనాలు కేసులు ఉన్నాయని, రెండవ వ్యక్తిగుత్తి కొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనులు కేసులు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా కర్నూల్ డి ఐ జి  కోయ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ , నంద్యాల జిల్లా  ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్, నంద్యాల అడిషనల్ ఎస్పీ  యగంధర్ బాబుగారు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన పోలీస్ ఆపీసర్స్ ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.