రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది
*గ్రామాలు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం*
*స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుదాం*
*వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, దేవేంద్రప్ప, నాయకులు ఉమాపతి నాయుడు*
ఆదోని ప్రతినిధి,జులై 15, నంది న్యూస్:
రాష్ట్రంలో రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చిందని, ఏపీ సీడ్ చైర్మన్, అబ్జర్వర్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పోరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మహిళ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని నెట్టేకల్ గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీడ్ చైర్మన్, అబ్జర్వర్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాజరయ్యారు. వారందరికీ మహేష్ యాదవ్ స్వగృహంలో ఘనంగా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి తోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు అందుకు అనుగుణంగా పని చేయాల్సి ఉందని తెలిపారు. లోటు బడ్జెట్ తో ఉండే రాక్షస పాలన కొనసాగించిన అదరకుండా, బెదరకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని, తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు నారా లోకేష్ కూడా తనదైన శైలిలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. తెలుగు దేశంలో కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు ఉంటుందని,క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం అని వారన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం లో ఉన్న అన్ని పంచాయతీల్లో కూటమి నాయకుల జెండాలను ఎగురవేయాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూటమి ది ఉంది కాబట్టి సర్పంచులుగా మీ గ్రామాలలో కూటమి నాయకులు ఎన్నికైతే మీ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని గ్రామ ప్రజలకు తెలియజేశారు.. ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రతి కార్యకర్త నాయకులు ముందు వచ్చి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపుదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రంగస్వామి నాయుడు, ఉమ్మే సలీం, నీలకంఠప్ప, రంగన్న, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, రైతు సంఘం నాయకులు అయ్యన్న, చాగి మల్లికార్జున, నెట్టేకల్ టిడిపి నాయకులు మహేష్ యాదవ్, మహానంది యాదవ్, కేశవ్ యాదవ్, భీమ్ రెడ్డి యాదవ్, వీరారెడ్డి యాదవ్, బాలు యాదవ్, శేఖర్ యాదవ్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List