సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...

On

IMG-20250707-WA0074

 

కర్నూల్ డిఎస్పి జె .బాబు ప్రసాద్

కర్నూల్ డిఎస్పీ ఆఫీస్ లో నిందితుల వివరాలను మీడియాకి వెల్లడించిన డీఎస్పీ.

నేరానికి ఉపయోగించిన కత్తులు , బైకులు స్వాధీనం. కర్నూలు నంది పత్రిక.....సూదిరెడ్డి పల్లె గ్రామములొ 01.07.2025 వ తేదీన రాత్రి సుమారు 7.45 నిమిషాలకు కురువ శేషన్న అనే వ్యక్తి తనకూతురు శకుంతల ఇంటిలోని బెడ్ రూమ్ లో పడుకొని ఉండగా, అదే గ్రామానికి చెందిన పరుశురాముడు మరియు అతని మిగిలిన ముగ్గురు అన్నతమ్ములు కలిసి ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి ఫిర్యాదు తండ్రి పడుకొని ఉండగా, పై నలుగురు వ్యక్తులు కురువ శేషన్నను చంపాలనే ఉద్దేశ్యంతో అతని పై దాడి చేయగా, ఆ దాడిలో అతడు చనిపోగా, అతని యొక్క కుడి కాలును (మోకాలు క్రింది భాగామును) వేరు చేసి బైక్ లో తీసుకొని వెళ్ళినారనే దానిపై చనిపోయిన శేషన్న కూతురు శకుంతల ఫిర్యాదు మేరకు కర్నూల్ తాలూకా పోలీస్ వారు Cr.No.257/2025 U/sec 329(4),126(2),127(2), 118(2), 103(1) r/w 3(5) BNS-2023 గా నమోదు చేసినారు. ముద్దాయిల కోసం కర్నూల్ డి. ఎస్. పి ఆధ్వర్యంలో, కర్నూల్ తాలూకా CI శ్రీధర్, SI చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బందిని బృందాలుగా నియమించి గాలింపు చర్యలను చేపట్టడం జరిగింది. తదుపరి రాబడిన సమాచారం మేరకు తాలూకా CI , 06.07.2025 వ తేదీన సాయంత్రం 5.00 గంటల కాలమప్పుడు వెంగన్న బావి దగ్గర లో గల శివాలయం వెనుక వైపు 

1.కురువ పరుశరాముడు, వయస్సు 29 సం రాలు, తండ్రి: లేట్ కురువ ఎల్లయ్య @ తెల్లన్న, ఇంటి నెంబర్: 1- 

   సూదిరెడ్డి పల్లి గ్రామం, కర్నూలు మండలం మరియు జిల్లా. 

2.కురువ విజయ కుమార్ @ కుమార్, వయస్సు 34 సం రాలు, తండ్రి: లేట్ కురువ ఎల్లయ్య @ తెల్లన్న,  

ఇంటి నెంబర్: 1-2,

సూదిరెడ్డి పల్లి గ్రామం, కర్నూలు మండలం మరియు జిల్లా, 

3.కురువ గోవిందు @ చౌదరి, వయస్సు 37 సం రాలు, తండ్రి: లేట్ కురువ ఎల్లయ్య @ తెల్లన్న, ఇంటి నెంబర్: 2-105,సూదిరెడ్డి పల్లి గ్రామం, కర్నూలు మండలం మరియు జిల్లా.  

4.కురువ బీసన్న, వయస్సు 49 సం రాలు తండ్రి: లేట్ కురువ ఎల్లయ్య @ తెల్లన్న, ఇంటి నెంబర్: 1-1, 

సూదిరెడ్డి పల్లి గ్రామం, కర్నూలు మండలం మరియు జిల్లా.  

అను పై తెలిపిన ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి నేరానికి ఉపయోగించిన కత్తులను మరియు మోటార్ సైకల్ ను స్వాదినము చేసుకున్నారు. కేసులను సత్వరం ఛేదించిన కర్నూల్ సబ్ డివిజన్ డి. ఎస్.పి, జె. బాబు ప్రసాద్ గారిని మరియు వారి సిబ్బందిని జిల్లా SP విక్రాంత్ పాటిల్ IPS అభినందించినారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.