ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!

On


IMG-20250611-WA0031

హైదరాబాద్ జూన్ 11  ప్రతినిధి: హైదరాబాద్ బి ఆర్కే భవన్ లో కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విచారణ ముగిసింది ఆయనను పీసి ఘోష్, 50 నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించింది 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది.ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసా గింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశా లపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కా రానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారత దేశంలో నీటి లభ్యత, విని యోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరా లు కేసీఆర్ అందించారని సమాచారం.అంతేగాక పలు డాక్యు మెంట్లు కూడా కమిషన్‌కు ఆయన సమర్పించారు. విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి.. నేటి విచారణలో ఇచ్చిన సమా ధానాలను పరిశీలించి, వాటిపై సంతకాలు చేసారు. ఈ విచారణలో వన్ టూ వన్ విధానాన్ని అనుసరిం చడంపై కొన్ని విమర్శలు వచ్చినా, కమిషన్ వర్గాలు దీనిపై స్పందించాయి.కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడం తో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టూ వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి.విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ సోమజిగూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిను పరామర్శించారు. నేడు ఉదయం ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసంలో ఆయన జారిపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.