అహోబిలం నల్లమల అటవీ మార్గములో కారును ఢీకొన్న పెద్దపులి
అహోబిలం నల్లమల అటవీ మార్గములో కారును ఢీకొన్న పెద్దపులి

ఆళ్లగడ్డ ప్రతినిధి నవంబర్ 6 నంది పత్రిక: ఆళ్లగడ్డ మండలం రుద్రవరం అటవీ రేంజి పరిధిలోని దిగువ అహోబిలం ధర్మారెడ్డి పొలం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం నుండి పెద్దపులి కోతులను వెంటాడుతూ రోడ్డుమీదకు చేరుకుంది అదే సమయంలో ఆళ్లగడ్డ నుండి అహోబిలం దర్శనానికి వెళ్తున్న Ap029786 నంబర్ గల కారును పెద్దపులి బలంగా ఢీకొనడంతో పులి గాయాలయింది పెద్దపులి గాయాలతో అడవిలోకి వెళ్లిపోయిందని సమాచారం పెద్దపులి కారును ఢీకొనడంతో కారు డ్యామేజ్ అయింది దీంతో కారులో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు పెద్దపులి గాయాలతో అడవిలోకి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకున్నామని ప్రయాణికులు తెలిపారు సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న రుద్రవరం రేంజి సబ్ డి ఎఫ్ ఓ శ్రీనివాసరెడ్డి, రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి ముత్తు జావలి, సిబ్బంది ప్రొటెక్షన్ వాచర్లు సంఘటనా స్థలము చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Comment List