నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి -మంత్రి ఫరూక్

On

1c71e1e7-4e0b-45ee-b565-ec757692fcc8నంద్యాల ప్రతినిధి. మే 31 . (నంది పత్రిక ):డాక్టర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఫరూక్ ను నంద్యాల క్యాంపు కార్యాలయంలో, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.వి.ఆర్. ప్రసాద్ లతో కలసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో తాను కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా, కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ గా పని చేసే సమయంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఫరూక్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి క్యాన్సర్ యూనిట్ కోసం, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించిన విషయం గుర్తు చేసి మంత్రి ఫరూక్ కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక  చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి  వైస్ చాన్స్ లర్ డాక్టర్ చంద్రశేఖర్ ను కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి*  శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి* 
కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో కలకలం… వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం*  నగరంలోని "శ్రీ చక్ర ప్రైవేట్" హాస్పిటల్‌ వద్ద గురువారం ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సరైన చికిత్స...
నగరానికి ‘న్యూ లుక్’ తేవాలి
రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.
కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి
సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...
రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు