ఘనంగా కలశ దాతలకు మహా సంకల్పం

On

IMG-20250529-WA0061

 

నంద్యాల ప్రతినిధి. మే 29 . (నంది పత్రిక ):స్వర్ణోత్సవ వేడుకలో భాగంగా రెండవ రోజు గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కార్యక్రమాలు మొదలైనవి. 

ముందుగా శాంతి పాఠము, గురువందనము, మండప పూజలు, సహస్రఘట స్థాపనము, వారు నానువాక అది మంత్రనము, రుద్రహోమములు, చండీ హోమము, సుదర్శన హోమము, మూల మంత్ర హవనములు, దాన్యాదివాసము. మరియు అనేకమంది భక్తులకు మహాసంకల్పము చేయించడం జరిగినది.సాయంత్రం నాలుగు గంటలకు షాయాదివాసము, ఫల, పుష్ప, హిరణ్యాదివాసములు, హారతి, మంత్రపుష్పము, వేద స్వస్తి మొదలగు కార్యక్రమములు అన్ని వేద పండితులచే నిర్వహించబడినది.సాయంత్రం ఐదు గంటలకు జగద్గురు విద్యా శంకర భారతి మహాస్వామి వారిని నంద్యాల బస్టాండు ఆవరణలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి సంజీవ్ నగర్ రామాలయం వరకు స్వామివారిని బ్రహ్మాండమైన శోభాయాత్ర ద్వారా ఆలయంలోకి ఆహ్వానించడం జరిగినది.సా 7.00 గంటలకు అశేష భక్తుల మధ్య స్వామి వారి అనుగ్రహ భాషణం ఉదయము మరియు సాయంత్రం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరిగినది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News