అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 

On

ప్రజా ప్రతినిధులు, చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి

సామాజికంగా, ఆర్ధికంగా వైద్య పరంగా సహాయపడాలని వేడుకోలు 

 దిక్కుతోచని పరిస్థితులలో నిరుపేద కుటుంబం 

సోమవారం మే 19 నా బాధితుడి తల్లి బొజ్జ

సుగుణ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.

IMG-20250519-WA0031

 ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 19 

గోవిందరావు పేట మండలం ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొజ్జ మహేష్ వయసు 35 అనే వ్యక్తి

 8 నెలలుగా విపరీతమైన చర్మ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేసుకుంటున్నాప్పటికీ వ్యాధి నయం కావడం లేదు.

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగి ఆరోగ్య మరియు మెరుగైన వైద్య చికిత్స గూర్చి కూడా సరైన నిర్దారణ తెలియని అయోమయ స్థితిలో ఆ కుటుంబం ఉంది కావున ఈరోజు బాధితుడి ఆరోగ్య పరిస్థితి పూర్తి వివరాలు తెలియజేయాలని మెరుగైన అవకాశాలు ఉంటే హైదరబాద్ గాంధీ వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన బాధితుడి తల్లి బొజ్జ సుగుణ.

అడిషనల్ కలెక్టర్ వెంటనే డిఎంహెచ్ఓ కి ఆ వినతిపత్రం బదిలీ చేస్తూ రోగి ఆరోగ్య పరిస్థితి చికిత్స జరుగుతున్న విధానం,మెరుగైన వైద్యం కోసం విచారణ జరపవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.

ఈ వ్యాధి కారణంగా బాధిత

వ్యక్తి తీవ్రమైన శారీరక, మానసిక ఆర్ధిక ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు.

శరీరం మొత్తం పొక్కులు,బొబ్బలు నాలుకపై ఇంకా శరీరం లోపల కూడ ఇన్ఫెక్షన్ అవుతుంది.

బెడ్ పైనుంచి లేచే పరిస్థితి కూడా లేదు శరీరం రక్తసితంగా మారిపోతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో గత 4 నెలలుగా చికిత్స పొందుతున్నారు, అయినప్పటికీ బాడీ ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు.

 దిక్కుతోచని పరిస్థితుల్లో ఆపన్న హస్తం మరియు ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వ్యవసాయ కూలీగా జీవనం సాగస్తున్నా మహేష్ సంపాదన పై ఆధారపడి పిల్లలు అతని కుటుంబం జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులలో,ఇలాంటి పరిస్థితి మహేశ్ ను వారి కుటుంబాన్ని దిగ్గుతోని పరిస్థితుల్లోకి నెట్టింది.మహేష్ కి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు 8 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలే కావడంతో వారి పోషణ, హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు అయిన ఖర్చులకు, వారి స్తోమత మేరకు అనేక అప్పులు తీసుకుని,మరియు బంధువుల సహాయంతో వైద్యం కోసం, 

రోగ నిర్దారణ కోసం అనేక హాస్పటల్లో తిరుగుతూ గత 8 నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

కావున ప్రభుత్వం వారు మెరుగైన వైద్యం అందించాలని లేదా ప్రైవేట్ ఉన్నత ఆసుపత్రిలో అయిన ప్రభుత్వం వారు ఆదుకోవాలని

బాధితుడి తల్లి బొజ్జ సుగుణ  

కలెక్టర్ ను వేడుకున్నారు.

 

బ్యాంకు వివరాలు:

 

కెనరా బ్యాంకు పస్రా .

బొజ్జ మహేష్

ఖాతా నంబర్ :6774101001909

 

 ఐ ఎఫ్ ఎస్ సి కోడ్: CNRB0001923

సంప్రదింపు నంబర్:

 9121408124

ఫోన్ పే. గూగుల్ పే ..

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం..  క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం.. 
రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్కర్నూలు నంది పత్రిక..........క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు జులై 2వ తేదీ నుండి విమాన సౌక‌ర్యం ప్రారంభమ‌వుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్...
పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి
అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 
పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్
నిలిచిన రోడ్డు విస్తరణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు
కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి
దేశ భక్తి ఉట్టిపడేలా నంద్యాలలో తిరంగా యాత్ర