సేవాకార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నాం

On

-మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి 

సేవాకార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నాం
c15e51ce-aa09-4a72-baa7-07c745b5d6ec

నంద్యాల ప్రతినిధి. మే 26 . (నంది పత్రిక ):శిల్పా సేవాసమితి ద్వారా గత 15 సంవత్సరాల నుండి భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో నిరంతరాయంగా సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పేదింటి మహిళల ఉపాధికల్పనకు తమవంతుగా చేస్తున్న సేవాకార్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా భలోపేతం కావాలని ఆయన కోరారు. సోమవారం స్థానిక శిల్పా సేవాసమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 180 మంది లబ్దిదారులకు 26లక్షల 20వేల రూపాయల విలువగల చెక్ లను ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం  జరిగింది.  
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ... గత 15 సంవత్సరాల నుండి శిల్పా సేవాసమితి ద్వారా అనేక సేవాకార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నామని, అందుకు భగవంతుని, ప్రజల ఆశీర్వాదాలు తమపై ఉన్నాయన్నారు. పేదింటి మహిళలకు ఉపాధికల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతూ నేటికి 8వేల మంది మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి రంగాలలో శిక్షణ అందించామన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న కో-పరేటివ్ బ్యాంక్ లలో నూటికి నూరుశాతం రుణాల రికవరీ చేసిన ఏకైక సంస్థగా గుర్తింపు కలిగినదని, అందుకు శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ సిబ్బంది కృషి, లబ్ధిదారులైన మహిళల క్రమశిక్షణ, నిబద్ధత మాత్రమేనన్నారు. భవిషత్తులో పేద మహిళలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాడానికి కృషిచేస్తున్నామని, అందుకు వారి సలహాలను, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రుణాలు పొందిన లబ్ధిదారులైన మహిళలు సకాలంలో తిరిగి చెల్లించి తోటి మహిళలకు సహకరించాలని తద్వారా మరింత పురోగతి సాధించడం జరుగుతుందని సూచించారు. సేవాకార్యక్రమాలను నిర్వహించడం వల్ల తమకు సంతృప్తి కలుగుతుందని, కాబట్టి ఓడినా గెలిచినా శిల్పా సేవాసమితి ద్వార చేపడుతున్న సేవాకార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. భవిషత్తులో ముంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీరాములు,మా బాషా ,శివ నాగిరెడ్డి, మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హరిలీల, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News