ప్లేస్‌మెంట్‌లో పెద్ద విజయం – నేషనల్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపిక
-విద్యార్థుల ప్రతిభకు రుజువు: టీసీఎస్, విప్రో, అమెజాన్ వంటి దిగ్గజాల్లో ఉద్యోగాలు
-డిగ్రీతో పాటు ఉద్యోగం లక్ష్యం – నేషనల్ కళాశాల దిశగా విజయమైన అడుగులు
-ప్లేస్‌మెంట్ ఘనవిజయం – సాయి కుమార్, వేణుగోపాల్ కు అభినందనలు
-భవిష్యత్ బలంగా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు
-ఉద్యోగాలుగా విజయగాథ – నేషనల్ డిగ్రీ విద్యార్థుల ప్రాభవం
-మల్టీనేషనల్ కంపెనీలకు నేషనల్ డిగ్రీ స్టూడెంట్స్ హాట్ పిక్స్
నంది పత్రిక వ్యవసాయ విలేఖరి ఏప్రిల్ 16:-నేషనల్ డిగ్రీ కళాశాల కు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు 70 మంది వివిధ మల్టీ నేషనల్ కంపెనీ లలో ఉద్యోగాలు సాధించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డా. యస్. ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు.. బుధవారం నాడు కళాశాల ప్రాంగణం లో ప్లేసెమెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజేతల అభినందన కార్యక్రమం నకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2024..2025 విద్యా సంవత్సరంలో తమ కళాశాలలో బి. సి. ఏ., బి. యస్. సి(కంప్యూటర్స్)., బి. కామ్. (కంప్యూటర్స్) తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విప్రో టెక్నాలజీస్.. 16, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS).. 27, ఫాక్సకాన్ కంపెనీ.. 10, అమెజాన్.. 3, డాలాయిట్.. 2 ఇన్ఫోసిస్.. 2, కాల్క్ టెక్నాలజిస్.. 5, ట్రూ ప్రాజెక్ట్స్.. 10..అలసెట్ బిజినెస్ సొల్యూషన్స్.. 4..ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.. 1994 లో కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు తమ కళాశాల విద్యార్థులు ప్రతీ సంవత్సరం వందల మంది విద్యార్థులు ప్రముఖ బహుళ జాతి సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికలలో తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలను సాధిస్తూ, కళాశాల కీర్తిని ఇనుమడింప జేసినట్లు తెలిపారు... తమ కళాశాలలో చదివే ప్రతీ విద్యార్ధికి డిగ్రీ పట్టా తో పాటు కనీసం ఒక కంపెనీ లో ఉద్యోగాన్ని కల్పించాలనే సంకల్పం తో తాము చేస్తున్న కృషికి ఈ రోజు మా విద్యార్థులు సాదించిన ఈ అద్భుత ఫలితాలు నిదర్శనం గా నిలుస్తాయని అన్నారు.. ఇంకో 45మంది విద్యార్థులు వివిధ కంపెనీల ఇంటర్వ్యూ లకు హాజరై, తుది ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారని తెలిపారు.. ఉద్యోగాలు సాధించిన ప్రతీ విద్యార్ధికి కంపెనీ ద్వారా వచ్చిన నియామక పత్రాలను ఆయన అందజేశారు.. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు సాధిచేలా విద్యార్థులకు కావలసిన నైపుణ్యాలను అందించి, వారిని విజేతలు గా నిలపడంలో నిరంతర కృషి చేసిన డిగ్రీ కళాశాల ప్లేసెమెంట్ అధికారి సాయికుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ లను ఆయన అభినందించారు..
Comment List