రాజుపాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ 

On

IMG_20250312_195426

 రాజుపాలెం మండలం నంది పత్రిక  

 ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని రాజుపాలెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్.పి శ్రీ ఈ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

👉🏽 ఉమెన్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

👉🏽 స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు.

👉🏽 సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

👉🏽 దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్ లో సి.సి.టి.ఎన్.ఎస్ పనితీరును పరిశీలించారు. 

👉🏽 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి  క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

👉🏽 స్టేషన్ లో సిబ్బంది విధులను గురించి జిల్లా ఎస్.పి గారు అడిగి తెలుసుకున్నారు. మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. వృత్తి పరమైన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

👉🏽 పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

👉🏽 కోర్టు లో ఉన్న కేసుల విచారణ త్వరిత గతిన జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

👉🏽  రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను(బ్లాక్ స్పాట్స్) గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

👉🏽 పాత నేరస్థులు, సస్పెక్ట్ ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు.

👉🏽 విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజల తో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. గ్రామాల్లో నైట్ హాల్ట్ చేయాలని ఆదేశించారు.

👉🏽 అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర నేరాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా ఎస్.పి వెంట ప్రొద్దుటూరు డి.ఎస్పీ శ్రీమతి పి.భావన, ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ బాల మద్దిలేటి, ఎస్.ఐ వెంకటరమణ, సిబ్బంది ఉన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ