రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

On

GridArt_20250501_180623397

మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 8 వ తరగతి పూర్తి చేసుకుని 9 వ తరగతి లోకి అడుగు పెడుతుంది. గతంలో కూడా సుద్దముక్కతో రాకెట్ ను వేసి సూక్ష్మ కళాకారిణి ప్రతిభ చూపిన ముకుంద ప్రియ వేసవి సెలవులు ఉండడంతో చిత్ర లేఖనం పై దృష్టి సారించింది. అందులో భాగంగానే రాఘవేంద్రస్వామి బాలకృష్ణుని మూర్తిని ముఖానికి హత్తుకునే విధంగా బృందావనంతో పాటు చిత్రం వేసిన రూపం, శివుడు, ఆంజనేయస్వామి రూపాలను వేసిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. విద్యార్థిని ప్రతిభను చూసి శభాష్ అంటున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ