నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం

On

GridArt_20250314_191724155

నంద్యాల ప్రతినిధి. మార్చి 14 . (నంది పత్రిక ):నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కావడంతో మెట్రో నగరాలకు పరమితమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నంద్యాలలో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు.నంద్యాల పట్టణంలో ప్రజలు వైద్య పరంగా కొన్ని సేవలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ ,చెన్నై,బెంగళూరు ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకునేవారు.అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలో నంద్యాల వైద్యులు ముందుకు వస్తున్నారు.కార్పొరేట్ వైద్యాన్ని నంద్యాల ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారన్నారు.డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి లు మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలతో పేస్టు ఆర్థోపెడిక్ సేవలను అందుబాటులో ఉన్నాయన్నారు.చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలు ,టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్లు ఉండేవని ఇప్పుడు ఆర్థోపెడిక్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.డాక్టర్లు సుమన్,ఫతిమాలు వైద్య సేవలు అందిస్తారని అన్నారు.ఆక్సిడెంట్ కేసులు,జాయింట్ రీ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.డాక్టర్లు సుమన్,ఫతిమాలు వైద్య సేవలు అందిస్తారని అన్నారు.ఆక్సిడెంట్ కేసులు,జాయింట్ రీ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ సాదారణ కాన్పులు,డెలివరీ సమయంలో మహిళలు ఇబ్బందులు పడకుండా కాస్మొటిక్ గైనకాలజీ వింగ్ ను ఏర్పాటుచేశామన్నారు.డెలివరీ సమయంలో కుట్లు పడడం,గర్భసంచి జారిపోవడం,యోని లూజు కావడం,కొందరికి మూత్రం పడిపోవడం జరుగుతుందని అన్నారు.ఈ సమస్యలకు ఆపరేషన్ లేకుండా వైద్య సేవలు( కాస్మొటిక్ గైనకాలజి ట్రీట్మెంట్)అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు.గర్భసంచి సమస్యలకు పొట్టమీద కుట్లులేకుండా లాప్రోసిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సంతానం లేనివారు ఎందరో మా ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకున్నారని అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఆశయం ఉండేదన్నారు.మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖర్చుతో కూడుకున్నవి అన్నారు.హైదరాబాద్ కు ధీటుగా నంద్యాలలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించాలనే నా చిరకాల కోరికను కొడుకు,కోడలు తీర్చడం సంతోషంగా ఉందన్నారు.కృషి,పట్టుదలతో ప్రజలకు మంచి వైద్య సేవలు చేసి మంచిపేరు తెచ్చుకున్నారని ఒక తండ్రిగా,మామగా ఇంతకన్నా నాకు ఏమి కావాలన్నారు.హైదారాబాద్ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గగన్,ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి రవి కుమార్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ