విద్యార్థులకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ చాలా ముఖ్యము

On

IMG_20250318_195629
-డాక్టర్ ఎంవీ సుబ్రమణ్యం 

నంద్యాల ప్రతినిధి. మార్చి 18 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా నేరవాడ సమీపంలోని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో క్యాంపస్ రెడీనెస్ ప్రోగ్రామ్: క్వాంట్, రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సుబ్రమణ్యం, డీన్ కెరీర్ డెవలప్ మెంట్ సెల్ జే డేవిడ్ సుకీర్తికుమార్, రిసోర్స్ పర్సన్లు జోజిబాబు, అనిల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీ సుబ్రమణ్యం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి పోటీ పరీక్షలో ఉద్యోగం పొందడానికి ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ చాలా ముఖ్యమన్నారు.రోజుకు కొంత సమయం కేటాయించి ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ సబ్జెక్టులను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కెరీర్ డెవలప్ మెంట్ సెల్ డీన్ శ్రీ జె. డేవిడ్ సుకీర్తి కుమార్, ఉద్యోగం పొందడానికి కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు.రిసోర్స్ పర్సన్ జోజి బాబు, నేటి విద్యార్థులకు ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం పొందడానికి అవసరమైన కమ్యూనికేషన్ మరియు ఆప్టిట్యూడ్ నైపుణ్యాల గురించి ప్రసంగించారు.ఆయన శిక్షణలో కవర్ చేయబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా చెప్పారు.ఈ కార్యక్రమంలో విభాగ హెచ్ వోడీలు, కెరీర్ డెవలప్ మెంట్ సెల్ ఇన్ చార్జిలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ