శ్రీశైలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు

On

GridArt_20250327_192000399

-ట్రాఫిక్ పై ప్రత్యేక నిఘా కొరకు 03 డ్రోన్ కెమెరాల వినియోగం


 -నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా 
శ్రీశైలం. మార్చి 27 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సంధర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శన నిమిత్తం శ్రీశైలంనకు వచ్చు భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా  ఆదేశాలమేరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ  దిశా నిర్దేశం చేయడం జరిగింది.శ్రీశైలం శిఖరం వద్ద నుండి వద్ద నుండి ముఖద్వారం, సాక్షి గణపతి, హటకేశ్వరం,రామయ్య టర్నింగ్ టోల్గేట్ మరియు శ్రీశైలం లోని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 15 బ్లూ కోర్ట్ వాహనాలను మరియు 10 రక్షక్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలు నిరంతరం మూవింగ్ చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్యమైన కూడళ్ల యందు పికెట్స్ లను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.ఏదైనా సాంకేతిక కారణం వల్ల నిలిచిపోయి ట్రాఫిక్ అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోయింగ్ వాహనం ద్వారా ఇతర ప్రాంతాలకు తొలగించడం జరుగుతుంది.ట్రాఫిక్ నియంత్రణకు సరిపడా సిబ్బందితోపాటు ఇద్దరు డిఎస్పీ లతోపాటు 12 మంది ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ