సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు – ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు
– ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు
– ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 16 . (నంది పత్రిక ):శాంతి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలో సిఎస్సి (ఎఐఎంఎల్) శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ (ఎఐఎంఎల్) ల్యాబ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఎం. శాంతిరాముడు , ఛైర్మన్, ఆర్జీఎమ్ శాంతి రామ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హాజరై ల్యాబ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
"ప్రపంచం వేగంగా మారుతున్న డిజిటల్ యుగంలో, విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన అవసరం. ఎఐఎంఎల్ లాంటి సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగి ఉండటం విద్యార్థుల భవిష్యత్తుకు కీలకం. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకొని పరిశోధనల్లో భాగస్వాములవుతారు. ఇలాంటి ల్యాబ్ ఏర్పాటుకు తోడ్పడిన విభాగాధిపతులు, బోధన సిబ్బంది అందరికీ అభినందనలు" అన్నారు.ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సుబ్రమణ్యం మాట్లాడుతూ,
"ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త పద్ధతుల్లో నేర్చుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేసే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు."డా. డి. వి. అశోక్ కుమార్ , డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతూ,ఎఐఎంఎల్ ల్యాబ్ విద్యార్థులలో పరిశోధనాత్మక ఆలోచనల్ని పెంపొందించేందుకు, నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది." అని తెలిపారు.ఈ ప్రారంభ కార్యక్రమానికి కళాశాల డీన్లు, విభాగాధిపతులు, బోధన సిబ్బంది, ముఖ్యంగా ఎఐఎంఎల్ విభాగం బృందం హాజరై విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ నైపుణ్యాలను మెరుగుపర్చాలని వారు ఆకాంక్షించారు.
Comment List