సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*
రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):
రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన వారు తలుపులకు తాళాలు వేసి ఉండడంతో వేణు కొంతమంది నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో మహిళా పోలీసు మాత్రమే ప్రారంభంలో అక్కడకు వచ్చినట్లు గుర్తించబడింది. ఆమెను ప్రశ్నించగా, తాను కిషోరీ అభివృద్ధి కార్యక్రమం నిమిత్తంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్ళి వచ్చినట్లు తెలిపారు.
ప్రజల ఆవేదన:
"ఇది ప్రజాసేవా కేంద్రం. ఇలాగే ఆలస్యంగా తెరిస్తే, పేద ప్రజలు ఎప్పుడు తమ సమస్యలు పరిష్కరించుకుంటారు?" అని ఓ స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన సమయంలో అధికారులు కనిపించకపోవడం పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Comment List