పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం

On

లక్ష్మీ నరసింహ యాదవ్

cbf2d57d-c539-41d4-bd4a-320714e1fa75పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం
-జ.లక్ష్మీ నరసింహ యాదవ్

 

నంద్యాల ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో గృహనిర్బంధం చేయడం తీరని దుష్చర్యగా భావిస్తున్నాను.ప్రజాస్వామ్యాన్ని అవమానించే ఈ చర్యను  కూటమి ప్రభుత్వం పిరికిపంద చర్య లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు.ఒక మహిళా నేతను నేరస్తురాలిలా ముట్టడి చేసి గృహ నిర్బంధంలో పెట్టడం స్వేచ్ఛా హక్కులకు విఘాతం కలిగించే చర్య. ఇది నేడు ఒక మహిళా నేతపై అయితే, రేపు రాష్ట్రంలో ప్రజల గొంతు వినిపించే ప్రతి ఒక్కరిపై జరగే ప్రమాదాన్ని సూచిస్తోంది. పోయిన వైసీపీ ప్రభుత్వంలో ఇలానే నిర్బంధాలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలానే ఉంది.2015లో ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మళ్లీ 2025 మే 2న భూమిపూజ చేయడమంటే, గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎలాంటి స్పష్టత లేకుండా కేంద్ర ప్రభుత్వాల మోసపూరిత ధోరణిని తేటతెల్లం చేస్తోంది. మూడు రాజధానుల నాటకంతో ప్రజల్లో అయోమయం రేపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను దుర్వినియోగం చేస్తోంది.భాజపా, తెలుగుదేశం, జనసేన పార్టీలు స్వలాభం కోసం స్వేచ్ఛా భావాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తుండగా, పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలు మరియు అనుచితమైనవిగా ఖండిస్తున్నాను. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని కించపరిచే వ్యాఖ్యలు వాస్తవాలను విస్మరించే రాజకీయ చర్యలే అని నిర్దేశిస్తున్నాను.ప్రజలకు హామీ ఇచ్చిన “సూపర్ సిక్స్” పథకాల అమలులో విఫలమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. శాంతి, అభివృద్ధి, లౌకికత – ఇవే కాంగ్రెస్ పాలనకు లక్షణాలు. నేడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ ప్రభుత్వం ముందు ప్రతి బాధ్యత గల పౌరుడు నిలదీయాలి.బిజెపి రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు మరియు  డిక్లరేషన్ ఏమైంది .రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద 24500 కోట్లు  వచ్చి ఉంటే వెనుకబడిన జిల్లాలలో సాగు తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసుకునేవారు మరి వీటి కారణం బిజెపి ప్రభుత్వం కాదా అని లక్ష్మీ నరసింహ యాదవ్ ప్రశ్నించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ