పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి

On

GridArt_20250417_214840797

-పోషణ్ పక్వాడ ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 17 . (నంది పత్రిక ):జిల్లాలో బడిఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి లీలావతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదిలోపు బడిఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జిఓఎంఎస్.117 ప్రకారం పాఠశాల సర్దుబాటు చేసిన తరుణంలో కొంత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలో చేరడం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సదరు జిఓలో సవరణలు చేస్తూ ప్రజా ప్రతినిధులు, పేరెంట్స్ కమిటీతో చర్చలు జరిపి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఒకటవ తరగతిలో చేరాలనుకున్న అంగన్వాడీ పిల్లలను గుర్తించి చేర్చేలా స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా మిగతా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి విద్యను అందిస్తున్నాం, వారికి అందించే భోజన సదుపాయం, వారికి కల్పించే భద్రతా ప్రమాణాలపై పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఏప్రిల్ 8వ తేది నుండి 22వ తేది వరకు పోషణ్ పక్వాడ ఉత్సవాలు*

ఏప్రిల్ 8వ తేది నుండి 22వ తేది వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషణ్ పక్వాడ ద్వారా పౌష్టికరమైన ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా రక్తహీనత, ఎదుగదల లోపం, అనీమియా ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యంగా పిల్లలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా మునగాకు తినడం వల్ల రక్తహీనతకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ