మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
నంది పత్రిక దినపత్రిక గడివేముల
నంద్యాల జిల్లా గడివేముల పరిధిలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల దాటిన ఏ ఒక్క అధికారి మరియు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న లేకపోవడం గమనార్హం. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు కార్యాలయం వద్ద కూర్చుని అధికారుల కోసం వేచి చూసి కార్యాలయానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదరికి వెళ్లిపోయారు. కార్యాలయంలో ఏ ఒక్క అధికారిని నియమించకపోవడం సమయం గడుస్తున్న కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో కాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.( కార్యాలయంలో సమాచారం సేకరిస్తే మీటింగ్ ఉన్నందువలన వెళ్ళవలసి వచ్చిందని తెలిపారు కానీ మీటింగ్ ఉంటే ఆఫీసు సిబ్బంది ఔట్సోర్సింగ్ సిబ్బంది అధికారులు మొత్తము వెళతారా అన్నది శోచనీయం ) కార్యాలయంలో అధికారులు తమ విధులు నుండి తప్పించుకోవడానికి లేదా వారి వ్యక్తిగత కార్యకలాపాలకు వెళ్లడానికి కేటాయిస్తూ ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇలా ఉంటే సమయపాలన పాటించని సిబ్బందినిపైన అధికారులపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
Comment List