చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  

On

IMG-20250426-WA0060

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 26 . (నంది పత్రిక ):నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో చెంచు కుటుంబాలకు తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట శివప్రసాద్ సహా పరిశోధన సంచాలకులు ఏడిఆర్ డాక్టర్ జాన్సన్ జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ శివప్రసాద్ మాట్లాడుతూ చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందులో భాగంగా తేనెటీగల పెంపకం పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తేనెటీగలకు అవసరమైన బాక్సులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం జాన్సన్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల వారు మాట్లాడుతూ ఈ ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు నవలంబించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటకు దోహదపడుతుంది అని పేర్కొన్నారు.అదేవిధంగా తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే తేనెటీగల వలన పంట సాగులో పుష్పాలన్ని కూడా బాగా ఫలదీకరణం చెంది అధిక దిగుబడి పొందటానికి తేనెటీగల పెంపకం దోహ దపడటంతో పాటు గా వీటి పెంపకం వలన అదనపు ఆదాయం కూడా పొందవచ్చని రైతులను ఉద్దేశించి సూచించారు.ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా వ్యవసాయ అధికారి వై మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి తేనెటీగలకు ఏమాత్రం హాని కలగకుండా తేనె తీయడం వలన తేనెటీగల పరిరక్షిస్తూ వాతావరణాన్ని కూడా పరిరక్షించినట్లు అవుతుందని తెలియచెప్పారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ఏజీ నాయక్ గారు వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి సిబ్బంది వెలుగు సిసి వీరన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందినటువంటి వారికి తేనెటీగల పెంపకానికి తేనెటీగల పెట్టెలు శిక్షణ పొందిన వారికి ఇవ్వడం జరిగింది. ఏడు రోజుల శిక్షణ కార్యక్రమానికి పూర్తి చేసుకున్నటువంటి వారికి సర్టిఫికెట్లు కూడా ప్రధానం చేయడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ