ఆళ్లగడ్డ సబ్ జైల్ ను తనిఖీ చేసిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి
ఆళ్లగడ్డ ప్రతినిధి ఏప్రిల్ 30 నంది పత్రిక
ఆళ్ళగడ్డ పట్టణంలోని ఉపకారాగారాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో వున్న ముద్దాయిలతో సమావేశం నిర్వహించారు. సబ్ జైల్లో ఖైదీలకు కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరాతీశారు. వైద్య సదుపాయాలు,భోజన వసతులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని నియమించుకోలేని వారికి న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఏవైనా న్యాయ పరమైన సమస్యలు వ్య్నట్లయితే జైలులో ఉన్న న్యాయ సేవా కేంద్రం ద్వారా సహాయం పొంద వచ్చని వివరించారు. ఆన్ లైన్ నంబర్ 15100 కు కూడా తెలుపవచ్చన్నారు. ఆళ్లగడ్డ సబ్ జైల్లో పరిమితికి మించి ముద్దాయిలు ఉన్నారని గుర్తించి జైలు సూపరిండెంట్ షల్వంత్ కు సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రములో సూపరిండెంట్ శల్వంత్, ఫ్యానెల్ లాయర్లు లార్డ్ వర్డ్ మోషన్,షహీనా బేగం, మెడికల్ ఆఫీసర్ నాగమస్తాన్ లు పాల్గొన్నారు.
Comment List