నిలిచిన రోడ్డు విస్తరణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు

On

GridArt_20250518_215422998

రుద్రవరం ప్రతినిధి మే 18 (నంది పత్రిక):

మండల కేంద్రం రుద్రవరం నుంచి నరసాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చాగలమర్రి నుంచి మహదేవపురం వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు మంజూరు అయ్యాయి. దీంతో నరసాపురం వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. నరసాపురం నుంచి రుద్రవరం వరకు పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన రెండు రోజులకే పనులను నిలిపివేశారు. రోడ్డు మరమ్మతుల కోసం తీసిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. వాహనాలు రాకపోకల సమయంలో ఎదురెదురు పడిన సందర్భంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం తువ్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు మరమ్మతుల కోసం తీసిన గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ రహదారి వెంట మహానంది, అహోబిలం , చాగలమర్రి, ఆళ్లగడ్డ తదితర గ్రామాలకు నిత్యం వాహనాలు రద్దీగా తిరుగుతుంటాయి. ప్రస్తుతము భారీ వర్షాలు కురుస్తుండడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు నడుపుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం పట్ల వాహనదారులు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు తమ స్వార్థం కోసము ఇలా రోడ్డు నిర్మాణ పనులను ఆపడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని ప్రయాణికులు గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం..  క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం.. 
రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్కర్నూలు నంది పత్రిక..........క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు జులై 2వ తేదీ నుండి విమాన సౌక‌ర్యం ప్రారంభమ‌వుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్...
పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి
అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 
పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్
నిలిచిన రోడ్డు విస్తరణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు
కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి
దేశ భక్తి ఉట్టిపడేలా నంద్యాలలో తిరంగా యాత్ర