సీఎం చంద్రబాబు సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వీచ్ అదుర్స్
* రాయలసీమలో ఒక్కపూట కడుపు నిండా అన్నం తింటే అదేసాలు అనుకుంటాం.
రాయలసీమకు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి.
కేసీ కెనాల్ కు గుండెకాయ లాంటి గుండ్రవుల ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేయండి.
కుంగిన అలగనూరు రిజర్వాయర్ కు వెంటనే మరమ్మత్తులు చేయండి.
గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు విడుదల చేయాలి.
నంద్యాల మెడికల్ కళాశాల లోకి ప్రభుత్వ ఆసుపత్రిని మార్చి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కు వినతి.
పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ భూకబ్జాలపై ప్రత్యేక కమిటీ వేసి భాధితులకు న్యాయం చేయండి.
సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ స్వర్నాంద్ర ప్రదేశ్ గా మారబోతోంది.
నంద్యాల ప్రతినిధి. మే 17 . (నంది పత్రిక ):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఉపన్యాసం రాయలసీమ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. సమస్యలు ఇవి వాటిని సీఎం చంద్రబాబు పరిష్కరిస్తేనే ఒక్క పూట అయినా కడుపునిండా తిండి తిన్నంత సంతోషం కలుగుతుందని కుండలు భద్దలు కొట్టినట్లు సమస్య లు సీఎం కు వివరించారు.
శనివారం పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలో స్వర్నాంద్ర, స్వచ్చంద్రా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ విజనరీ లీడర్ మా సీఎం చంద్రబాబు అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ 2020 చేపట్టిన ఫలితాలు ప్రస్తుతం అనుభవిస్తున్నామని, మరో మారు ముందు చూపుతో విజన్ 2047 ను సీఎం చంద్రబాబు చేపట్టారని, మంచి సంకల్పంతో చేపట్టిన విజన్ 2047 విజయవంతం అవుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆశాభావం వ్యక్తం చేశారు.
గత వైసీపీ పాలనలో వెయ్యి రూపాయల పెన్షన్ పెంపుకు ఇదేళ్ళ సమయం పట్టిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అర్హులైన వృద్ధులు, వితంతు మహిళలకు రూ 4 వేలు పెన్షన్, దివ్యాంగులకు రూ. 6 వేలు, దీర్ఘకాళిక రోగులకు రూ. 10 వేల పెన్షన్ పెంచి ప్రతి నెల ఒకటవ తేదీననే వారి తలుపు కొట్టి పెన్షన్ అందిస్తున్న ఘనత చంద్రబాబు కే దక్కుతుందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
గత వైసీపీ పాలన రాయలసీమను రాళ్ళ సీమగా చేసిందని, సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజల కష్టాలు తొలగించేందుకు తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారాని, కేసి కెనాల్ కు గుండెకాయాలాంటి గుండ్రవుల రిజర్వాయర్ చేపట్టి కర్నూలు, కడప జిల్లా లో సుమారు 2 లక్షల 67 వేల ఎకరాల ఆయకత్తును కాపాడాలని, కుంగిన అలగనూరు రిజర్వాయర్ కు నిధులు కేటాయించి నీరు నిల్వ చేయాలని, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల కట్ట లకు రాతి కట్టడం ( రివిట్ మెంట్) కుంగడం వల్ల పూర్తి స్థాయిలో నీరు నిలుకుకోలేని పరిస్థితి ఉందని, వాటి మరమ్మత్తులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నవించారు.
మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ చొరవతో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని 50 పడకల నుంచి 450 పడకల ఆసుపత్రి గా మీరు సీఎం ఉన్న సమయంలో నే చేశారు సార్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలోకి జిల్లా స్థాయి ఆసుపత్రి ని చేర్చి జిల్లా ప్రజలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. కల్లూరు ప్రజలు హంద్రీ నది దాటేందుకు కొత్త వంతెన మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం అన్న మంత్రి నారా లోకేష్ మాట ప్రకారం ఎన్నో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, మెగా డి ఎస్సీ హామీ నెరవేరుస్తున్న ఘనత సీఎం గా మీకే దక్కుతుందని, మహిళలు తమ సొంత కాళ్ళ పై నిలిచి కుటుంబాలను ఫోసిస్తున్నారంటే సీఎం గా మీరు మహిళలకు ఇచ్చిన భరోసా నే అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి చంద్రబాబు కు వివరిస్తూ నంద్యాల జిల్లా తో పాటు రాయలసీమ సమస్యలు సీఎం దృష్టికీ తీసుకెళ్లి ఎంపీ శబరి ఉపన్యాసం అదుర్స్ అనిపించేలా ప్రశంగించారు.
Comment List