కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి

On


IMG-20250518-WA0036

శ్రీశైలం. మే 18 . (నంది పత్రిక ):వన్య మృగాల నుండి భక్తులను కాపాడండి,శ్రీశైలం పుణ్యక్షేత్రం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని వచ్చే భక్తులకు భద్రత కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టియూసిఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం కోరారు.శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ స్థానిక టియూసిఐ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మాట్లాడుతూ భక్తులు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్ర మరియు వివిధ దేశాల నుండి లక్షల మంది శ్రీశైల పుణ్యక్షేత్రానికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వందల వేల కిలోమీటర్ల నుండి వాహనాల ద్వారా బస్సులో వస్తుంటారని అయితే శ్రీశైలం దట్టమైన నల్లమల అడవుల్లో ఉండడం వలన పెద్ద పులులు చిరుత పులులు శ్రీశైలంలోకి వస్తున్నాయని. పట్టపగలే కొన్ని ప్రాంతాలలోకి వన్య మృగాలు వస్తున్నాయి భక్తులు సేద తీసుకుంటే పార్కులలోకి చిన్న చిన్న దేవాలయాల్లోకి పెద్దపులులు చింతపులు ఎలుగుబండ్లు వస్తున్నాయని. ఆదివారం ఉదయం మల్లమ్మ కన్నీరు దగ్గర పెద్దపులి కనిపించడం చర్చనీయా అంశమైంది.అభివృద్ధి పనులు చేస్తుండగా జెసిపి డ్రైవర్ కు పెద్దపులి రావడంతో భయభ్రాంతులకు గురి అయ్యాడని అక్కడ పనిచేసే కూలీలు పరుగులు తీశారు.నిరంతరం ఊరు బయట తోటల్లో తోటమాలి కార్మికులు పనులు నిత్యం పార్కులో అభివృద్ధి కోసం పనిచేస్తుంటారని అదేవిధంగా చుట్టూ చెంచు గుడిసెలు సత్రాలు అడవికి దగ్గరగా ఉన్నాయని చుట్టూ రింగ్ రోడ్డు అడవికి ఆనుకొని ఉంది.నిరంతరం యాత్రికులు తిరుగుతుంటారని. స్థానిక ప్రజల భక్తుల ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం చుట్టూ పెద్ద కంచె ఏర్పాటు చేయాలని. కోరుతూ అదేవిధంగా సుండిపెంట గ్రామంలో స్థానిక ప్రజలు పెద్ద పులులు చిరుత పులులు వెలుగుబంట్లు భయంతో బ్రతుకుతున్నారని ఈ గ్రామానికి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని. అట్లా చేయడం వలన జంతువులు ప్రజలు సంచరించోటికి రాకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది అందుకు తగిన జాగ్రత్తలు దేవస్థానం ఈవో ఫారెస్ట్ ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి అడివిశాఖ మంత్రి దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి యాత్రికులకు స్థానిక ప్రజలకు ప్రాణాలు కాపాడుటకు చుట్టు కంచెను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని కోరడమైనది. టియూసిఐ వై శీను పి మల్లికార్జున. కే వెంకటేశం. నాగూర్ వలి. శిక్షావలి. అప్పలకొండ.గోపాల్ వి. రవి. తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం..  క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం.. 
రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్కర్నూలు నంది పత్రిక..........క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు జులై 2వ తేదీ నుండి విమాన సౌక‌ర్యం ప్రారంభమ‌వుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్...
పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి
అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 
పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్
నిలిచిన రోడ్డు విస్తరణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు
కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి
దేశ భక్తి ఉట్టిపడేలా నంద్యాలలో తిరంగా యాత్ర